ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసేదిశగా ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. విద్యావారోత్సవాల్లో భాగంగా బుధవారం రిమ్స్ ఆస్పత్రిలోని ఆడిటోరియంలో ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని సర్పంచులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జ్ డీఈవో రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్, డీఎల్పీవో ఫణిందర్, కో-ఆర్డినేటర్ అజయ్ పాల్గొన్నారు.
సర్పంచులు ముందుకు రావాలి
చొప్పదండి, వెలుగు: ప్రభుత్వ స్కూళ్ల బలోపేతానికి సర్పంచులు చురుకైన పాత్ర పోషించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే సూచించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని నవోదయ విద్యాలయంలో చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాలకు చెందిన సర్పంచులు, మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లకు వర్క్‌షాప్ నిర్వహించారు. స్కూళ్ల బలోపేతానికి సర్పంచులు ముందుకు రావాలని అడిషనల్ కలెక్టర్ పిలుపునిచ్చారు.
కోరుట్ల,వెలుగు: కోరుట్లలో నియోజక స్థాయి విద్యావారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్చైర్పర్సన్లు తిరుమల వసంత మైలారపు లింబాద్రి, వైస్ చైర్‌పర్సన్లు షాహిద్, నవీన్, ఎంపీడీవోలు, ఎంఈవోలు, తదితరులు పాల్గొన్నారు.
