- కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు : ప్రతి విద్యార్థి పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ విద్యా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని సెంట్రల్ లైబ్రరీలో నిర్వహించిన ‘లైబ్రరీ డే’ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లెపూల నర్సయ్య కలెక్టర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
