ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: పార్లమెంట్సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్‌ను పోల్చడం సిగ్గుచేటని, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ ఫైర్ అయ్యారు. ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం ఆదిలాబాద్‌లోని తెలంగాణ చౌక్‌లో ప్రధాని మోదీ, తేజస్వి సూర్య దిష్టిబొమ్మలను దహనం చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ నేతలు తెలంగాణ ప్రజల మనోభావాలను పదేండ్లుగా కించపరుస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌చేశారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, టీపీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డి, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

