రాష్ట్ర స్థాయి సబ్ ​జూనియర్​ అథ్లెటిక్స్ ​ఓవరాల్ ​చాంపియన్​గా ఆదిలాబాద్​ 

రాష్ట్ర స్థాయి సబ్ ​జూనియర్​ అథ్లెటిక్స్ ​ఓవరాల్ ​చాంపియన్​గా ఆదిలాబాద్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్​లో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి సబ్​ జూనియర్​ అథ్లెటిక్స్​ పోటీల్లో  ఓవరాల్ చాంపియన్​గా ఆదిలాబాద్​ జిల్లా నిలిచింది. అథ్లెటిక్స్​ పోటీలను జిల్లా పరిషత్​ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్​, రాష్ట్ర అథ్లెటిక్స్​ అసోసియేషన్​ అసోసియేషన్​ జనరల్​ సెక్రటరీ కె. సారంగపాణి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి దాదాపు 800 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అండర్​ 8, 10, 12, 14 విభాగాల్లో బాయ్స్​, గర్ల్స్​ ఈ పోటీల్లో పాల్గొన్నారు.