ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ కాలగర్భంలో కలిసిపోతోంది. 44 ఏళ్ల సిమెంట్ ఫ్యాక్టరీ ఆనవాళ్లు నేలమట్టమవుతున్నాయి. ఇటీవల సిమెంట్ ఫ్యాక్టరీ స్క్రాప్ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ యంత్రాలు, భవనాలు తొలగిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం వంద అడుగుల ఎత్తులో ఉన్న ప్యాకింగ్ ప్లాంట్ ను కూల్చివేశారు.
తాజాగా కాంట్రాక్టర్ సీసీఐ కూల్చివేత పనులు స్పీడప్ చేశారు. ఇందులో భాగంగా భారీ ప్యాకింగ్ ప్లాంట్ పిల్లర్లు ప్రొక్లైన్ సాయంతో తొలగించడంతో సెకన్లలోనే భవనం కూలిపోయింది. ఒకప్పుడు ఆదిలాబాద్ అంటేనే సిమెంట్ ఫ్యాక్టరీ గుర్తొచ్చేది. ఇప్పుడు కండ్ల ముందే సీసీఐ జ్ఞాపకాలు శిథిలమవుతుండటంతో జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
