రాష్ట్రస్థాయి క్రీడల్లో అగ్రస్థానంలో ఆదిలాబాద్ : కలెక్టర్ రాజర్షి షా

రాష్ట్రస్థాయి క్రీడల్లో అగ్రస్థానంలో ఆదిలాబాద్ : కలెక్టర్ రాజర్షి షా
  •     కలెక్టర్​ రాజర్షి షా

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్-2025 (సెకండ్ ఎడిషన్) పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా ఓవరాల్ ఛాంపియన్స్ ‌‌గా నిలివడం గర్వకారణమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా క్రీడాకారులను, జిల్లా క్రీడల అధికారి జక్కుల శ్రీనివాస్, కోచ్ ‌‌లు, సంబంధిత సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. 

రాష్ట్రంలోని 33 జిల్లాల క్రీడాకారులకు నిర్వహించిన పోటీల్లో సత్తా చాటి ఓవరాల్ ఛాంపియన్స్ ‌‌గా నిలిచిన అదిలాబాద్ క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్ రాజేశ్వర్, ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్ర, ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రవీందర్, అధికారులు 
పాల్గొన్నారు.