
ఆదిలాబాద్, వెలుగు: పోలీసుల పిల్లలు కష్టపడి చదివి, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకాంక్షించారు. పోలీస్‌కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు కనక పునరామ్ కూతురు వైష్ణవి ఐఐటీలో 1,581వ ర్యాంక్‌తో ఐఐటీ ముంబైలో జియో ఫిజిక్స్ కోర్సులో సీటు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమెను సన్మానించారు. అడిషనల్ఎస్పీ సురేందర్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, చంద్రశేఖర్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కు.. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ ఆర్.దిగంబర్ గత మార్చిలో ఆనారోగ్యంతో మృతిచెందారు. శుక్రవారం ఆయన భార్య రాథోడ్ శోభాబాయి, కుమారుడు అరుణ్ కుమార్ కు ఎస్పీ అఖిల్ మహాజన్ రూ.8 లక్షల చెక్కు అందజేశారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.