నార్నూర్ బ్లాక్కు మరో అవార్డు

నార్నూర్ బ్లాక్కు మరో అవార్డు

ఆదిలాబాద్, వెలుగు: నీతి ఆయోగ్ విడుదల చేసిన 2025 సెప్టెంబర్ త్రైమాసిక డెల్టా ర్యాంకింగ్స్​లో ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మరోసారి సత్తా చాటింది. దేశవ్యాప్తంగా ఉన్న 500 బ్లాక్‌లలో 4వ స్థానంలో నిలిచి మరో అవార్డు దక్కించుకుంది. దక్షిణ భారతంలోని జోన్- 3లో మొదటి ర్యాంక్ సాధించిందని కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. 

ఈ అసాధారణ ప్రదర్శనకు గుర్తింపుగా మండలానికి  రూ.1.5 కోట్లు పురస్కారం లభించిందని తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసే మండలాల్లో నార్నూర్ ఒకటిగా నిలిచిందని, జిల్లా ప్రజలకు గర్వకారణమన్నారు. తాజాగా డెల్టా ర్యాంకింగ్స్​తో పాటు, ఇప్పటి వరకు నార్నూర్ వివిధ పురస్కారాలు, ప్రోత్సాహకాలను కలిపి మొత్తం రూ.2.78 కోట్లు పొందిందని తెలిపారు.