మరింత ఆలస్యంగా ఆదిపురుష్

మరింత ఆలస్యంగా ఆదిపురుష్

ఇండియా వైడ్‌‌‌‌గా స్టార్ డమ్ తెచ్చుకున్న ప్రభాస్.. సౌత్, నార్త్ అనే సంబంధం లేకుండా ఫ్యాన్స్‌‌‌‌ను సంపాదించుకున్నాడు. అందుకే ప్రభాస్ సినిమా వస్తోందంటే అన్నింటా అంచనాలు పెరుగుతాయి. అలాగే ఆయన రాముడిగా కనిపించనున్న ‘ఆదిపురుష్​’ కోసం ఈగర్‌‌‌‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. కానీ మూవీ టీమ్ వారికో  బ్యాడ్ న్యూస్ చెప్పబోతోందని తెలుస్తోంది. మొదట అనుకున్న ప్రకారం సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్  కావలసి ఉంది. అయితే వచ్చే ఏడాది జూన్ 16కి  విడుదలను వాయిదా వేస్తున్నట్టు నెల క్రితం ప్రకటించారు. 

ఇప్పుడు ఆ రిలీజ్ డేట్‌‌‌‌పైనా నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. ‘ఆదిపురుష్​’ జూన్ 16కి రావడం కూడా కష్టమేనంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆశించిన స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరగకపోవడం ఒక కారణమైతే, వీఎఫ్ఎక్స్, అవుట్ పుట్‌‌‌‌ సరిగా రాకపోవడమే మెయిన్ రీజన్స్ అని తెలుస్తోంది. ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్‌‌‌‌‌‌‌‌కి కూడా మిక్స్‌‌‌‌డ్ టాక్ రావడం, రావణుడి గెటప్ మీద అభ్యంతరాలు, గ్రాఫిక్ వర్క్ మీద అసంతృప్తి వచ్చాయి. అందుకే ‘ఆదిపురుష్’ కోసం దర్శకుడు ఓం రౌత్  మరింత సమయం కేటాయించనున్నాడట. ఈ వార్తలపై టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.