ఆదిపురుష్ ప్రీమియర్స్ క్యాన్సిల్.. టీమ్కు కొత్త టెన్షన్

ఆదిపురుష్ ప్రీమియర్స్ క్యాన్సిల్.. టీమ్కు కొత్త టెన్షన్

ఆదిపురుష్ మూవీ టీమ్ కు కొత్త టెన్షన్ పట్టుకుందట. ఎం చేయాలో తెలియక ఏకంగా ప్రీమియర్స్ క్యాన్సిల్ చేశారట. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ప్రభాస్ రాముడిగా చేస్తున్న ఆదిపురుష్ మూవీ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ నటి కృతి సనన్ సీత పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 550 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. దీంతో.. ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా ఈ సినిమా ట్రిబెకా చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమవుతున్నట్టు వార్తలు వినిపించాయి. మూవీ టీమ్ కూడా ఈ విషయాన్ని అఫీషియల్ గా అన్నౌన్స్ చేసింది. ఈ ప్రీమియర్స్  జూన్ 13 నుండి మొదలుకానున్నాయి. అయితే ఈ షోస్ ని క్యాన్సిల్ చేసిందట టీమ్. ఎందుకంటే.. సినిమా రిలీజ్ కంటే రెండు రోజుల ముందు షోస్ వేస్తే.. ఎర్లీగా రివ్యూస్ వచ్చేస్తాయి. వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఒకవేళ నెగిటివ్ రివ్యూలు వస్తే అది ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని ఈ షోస్ క్యాన్సిల్ చేసినట్టు సమాచారం.

ఈ షోస్ ను జూన్ 15న సాయంత్రం ఎనిమిది గంటలకు, జూన్ 17న మధ్యాహ్నం 12 గంటలకు వేయనున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. మూవీ అవుట్ ఫుట్ పై టీమ్  నమ్మకంగా లేదా  అనే డౌట్స్ వస్తున్నాయని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.