ఓటీటీలో ఆదిపురుష్.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

ఓటీటీలో ఆదిపురుష్.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) రాముడిగా చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆదిపురుష్(Adipurush). బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్(Kriti Sanon) సీతగా కనిపిస్తోంది. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా.. జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణ(Ramayanam) గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

ఇక తాజాగా ఆదిపురుష్ ఓటీటీ స్ట్రీమింగ్(Adipurush Ott Streaming) గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్(Amazon) దక్కించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం భారీ మొత్తాన్నే ఖర్చు చేశారట. ఇక ఆదిపురుష్ ఓటీటీ స్ట్రీమింగ్ థియేట్రికల్ రిలీజైన ఎనిమిది వారల తరువాత కానుందట. ఏమినిది వారాలంటే.. రిలీజైన 56 రోజుల తరువాత ఓటీటీకి రానుంది ఆదిపురుష్ మూవీ. దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.