ఆదిపురుష్ టికెట్ రూ.2 వేలు.. ఎగబడి కొంటున్న ఫ్యాన్స్

ఆదిపురుష్ టికెట్ రూ.2 వేలు.. ఎగబడి కొంటున్న ఫ్యాన్స్

హిందూ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. సాహో, రాధే శ్యామ్ వంటి ఫ్లాపుల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడం ఒక ఎత్తైతే.. మూవీ ట్రైలర్, జై శ్రీరామ్ సాంగ్స్‌ అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే మూవీ టికెట్ రేట్లు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్క ఢిల్లీలోనే టికెట్ రేట్ రూ.2,000 పలుకుతోంది.  

ఢిల్లీలో రూ.2,000 తగ్గట్లేదు 

దేశ రాజధానిపరిధిలోని PVR Vegas LUXE, PVR Select city walk, Dwarka థియేటర్లలో టిక్కెట్ రేట్ రూ. 2000 పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొదటి రోజు టిక్కెట్లు పూర్తిగా అమ్ముడుపోగా, మరుసటి రోజు రూ. 1800 రూపాయలు చూపిస్తున్నట్లు అభిమానులు చెప్తున్నారు. అందుకు సంబధించిన స్క్రీన్ షాట్లను వారు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.  

ముంబైలోనూ అదే జోరు..

ఢిల్లీ తరహాలో ముంబైలోనూ అదే జోరు కనిపిస్తోంది. PVRలలోని అన్ని స్క్రీన్లు, జియో వరల్డ్ డ్రైవ్, BKCలలో అన్ని షోలకు రూ. 2000 పలుకుతోంది. అలాగే INOXలో, అట్రియా మాల్లోని ఇస్సిగ్నియా, వర్లీలలో రూ. 1700 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. మరుసటి రోజు కూడా దాదాపు రూ. 1500 వరకు చూపిస్తుండటం గమనార్హం. ఇప్పటికే ముంబై నగర వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో నో టికెట్స్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 

 

కోల్‌కతా, బెంగళూరు 

ఢిల్లీ, ముంబైతో పోలిస్తే.. కోల్‌కతాలో ఆదిపురుష్ టికెట్ రేట్లు కాస్త పర్లేదని చెప్పుకోవాలి. కోల్‌కతా సౌత్ సిటీ మాల్లోని  ఇన్ సిగ్నియా టిక్కెట్లు రూ. 1060గా ఉండగా, ఓవెస్ట్ మాల్‌లో రూ. 1090కి విక్రయిస్తున్నారు. ఇక బెంగుళూరు విషయానికొస్తే.. PVR, డైరెక్టర్స్ కట్, REX వాక్‌లలో రూ. 1600, రూ.1800గా విక్రయిస్తున్నారు. ఇక పీవీఆర్ గోల్డ్, వీఆర్ బెంగళూరు, వైట్ ఫీల్డ్ రోడ్లలో రూ.1150, రూ.1250 పలుకుతోంది. ఈ టికెట్ రేట్లను బట్టి భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.