ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. "ఆదిపురుష్" ట్రైలర్ డేట్ వచ్చేసింది

ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ..  "ఆదిపురుష్" ట్రైలర్ డేట్ వచ్చేసింది

ఇండియాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ "ఆదిపురుష్"(Adipurush) కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొన్నటి వరకు ఈ సినిమా రిలీజ్ మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరిగింది కానీ.. చిత్ర యూనిట్‌ మాత్రం ఈసారి అనుకున్న తేదీకి విడుదల చేసి తీరాలని ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాకి సంబంధించి మే 9న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశారు.

కొన్ని సెలెక్టెడ్‌ థియేటర్లలో త్రీడీ ట్రైలర్‌ను కూడా ప్రదర్శించబోతున్నారట. ఈ మేరకు అప్డేట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అంతే కాకుండా ఆదిపురుష్‌ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో ఈ వేడుక నిర్వహించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ట్రైలర్ రిలీజ్ మొదలుకొని.. వరుసగా మూవీ ప్రమోషన్స్ జరగనున్నాయి. ఇందుకోసం.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాలలో ఈ ఈవెంట్స్ జరగనున్నాయి.

మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో, దాదాపు 550 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రామాయణ గాధ ఆధారంగ వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్(Krithi sanon) సీతగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ కి ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు కూడా నెక్స్ట్ లెవల్ కి చేరుకున్నాయి. ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోవడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రిలీజ్ తరువాత ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో చూడాలి మరి.