సూర్యుడిపైనా అధ్యయనం .. ఆదిత్య పేలోడ్లు ఇవే

సూర్యుడిపైనా అధ్యయనం ..  ఆదిత్య పేలోడ్లు ఇవే

  వెల్క్ (విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్): ఇది 170 కిలోల బరువు ఉంటుంది. సూర్యుడి వాతావరణంలోని వేడి, మార్పులు, అంతరిక్ష వాతావరణం, భూ వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై పరిశోధనలు చేస్తుంది. ఏడు పేలోడ్స్​లో ఇదే కీలకం. గ్రౌండ్ స్టేషన్​కు రోజుకు స్టడీకి సంబంధించిన 1,440 ఫొటోలు పంపుతుంది. ఇలా ఐదేండ్ల పాటు ఫొటోలు పంపుతూనే ఉంటుంది.  

 

  సూట్ (సోలార్ అల్ట్రావయెలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్): దీని బరువు 35 కిలోలు. ఇందులో 11 ఫిల్టర్లు ఉంటాయి. ఇవి సోలార్ అట్మాస్పియర్​లోని వివిధ పొరల పూర్తి డిస్క్ చిత్రాలను తీస్తుంటాయి. అలాగే, ఫొటోస్పియర్, క్రోమోస్పియర్ వాతావరణంలోని అల్ట్రా వైలెట్ (యూవీ) దగ్గర్లోని పరిస్థితులపైనా ఇది స్టడీ చేస్తుంది. 200–400 ఎన్‌‌ఎం పరిధిలో సూర్యుడిని గమనిస్తూ ఉంటుంది. 

 

  యాస్పెక్స్ (ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పరిమెంట్): ఇది సోలార్ విండ్​లోని వైవిధ్యంతో పాటు వాటి లక్షణాలపై సమాచారాన్ని సేకరిస్తుంది. దీంతో పాటు సూర్యుడి వర్ణ పటం (సోలార్ స్పెక్ట్రమ్) లక్షణాలపై కూడా అధ్యయనం చేస్తుంది.

 

  పాపా (ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య): ఈ పేలోడ్ అంతరిక్షంలోని సోలార్ విండ్ ఎనర్జీతో పాటు శక్తివంతమైన అయాన్​లపై స్టడీ చేస్తుంది.

 

  సోలెక్స్ఎస్(సోలార్ లో ఎనర్జీ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్): ఇది సూర్యుడి ఉపరితలంలో జరిగే కరోనల్‌‌ హీటింగ్‌‌ మెకానిజాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్స్‌‌–రే ఫ్లేర్స్ పై పరిశోధనలు చేస్తుంది.

 

  హెచ్​ఈఎల్​1 ఓఎస్ (హైఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్): ఇది సూర్యుడి కరోనాలో డైనమిక్‌‌ ఈవెంట్‌‌లను గమనించడానికి ఉపయోగపడుతుంది. సూర్యుడిపై విస్ఫోటనం జరిగిన టైమ్​లో సౌరశక్తి కణాలను వేగవంతం చేయడానికి ఉపయోగించే శక్తిని అంచనా వేస్తుంది.

 

  ఎంఏజీ (డిజిటల్ మ్యాగ్నెటోమీటర్): ఈపేలోడ్ ను శాటిలైట్​కు ఆన్ బోర్డు పరికరంగా అమర్చి పంపుతున్నారు. ఇది శాటిలైట్​ ఉన్న ప్రాంతానికి సంబంధించిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ను ఎప్పటికప్పుడు అంచనా వేసి, ఆ సమాచారాన్ని పంపుతుంటుంది.