Mission Sun : ప్రతి రోజూ 1,440 ఫొటోలు పంపనున్న ఆదిత్య L1

Mission Sun : ప్రతి రోజూ 1,440 ఫొటోలు పంపనున్న ఆదిత్య L1

చంద్రయాన్ 3 ఇచ్చిన విజయంతో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఇస్రో. సూర్యడిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన అదిత్య L1నింగిలోకి దూసుకెళ్లింది.  PSLC-C57రాకెట్ అదిత్యను తీసుకుని కక్ష్య దిశగా ప్రయాణిస్తుంది.  4 నెలల్లో భూమి నుంచి 15 లక్షల కిమీ ప్రయాణించి సూర్యుడి L1కక్ష్యలోకి ఇది చేరుకుంటుంది.  అనంతరం అందులోని ఏడు పేలోడ్ లు వివిధ అంశాలపై పరిశోధనలు చేస్తాయి.  

ఇందులో విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌ (VELC) అత్యంత కీలకం.  ఇది సూర్యుడికి సంబంధించి  ఒక్కో నిమిషానికి సంబంధించి ఒక్కో ఫొటోను  రోజుకు 1, 440 ఫొటోలను ఇస్రోకు పంపనుంది. దీంతో పాటు సోలార్‌ అల్ట్రావయోలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌, ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పరిమెంట్‌, ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య, సోలార్‌లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, హైఎనర్జీ ఎల్‌-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, మాగ్నెటో మీటర్‌ పేలోడ్‌లను ఈ రాకెట్ కు  అమర్చారు. ఇది  సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ హీటింగ్, కరోనల్ మాస్ ఎజెక్షన్‌ వంటి అనేక విషయాలను అధ్యయనం  చేస్తుంది.   

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ టెక్నాలజీ క్యాంపస్‌ సంయుక్తంగా విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్‌ పేలోడ్‌ను అభివృద్ధి చేశాయి. ఇది పంపించే ఫొటోలు, ఇతర డేటా ఆధారంగా సూర్యుడి గురించి సమగ్రంగా అధ్యయనం చేస్తుంది ఇస్రో.