ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల తాగునీటి కష్టాలు

ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల తాగునీటి కష్టాలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవి బిడ్డలు నీటికోసం పడరాని పాట్లు పడుతున్నారు. మిషన్ భగరీథ ట్యాంకులు పూర్తయి..ఇంటింటికి నల్లా కనెక్షన్లు వేసినా..నీటి కష్టాలు గట్టెక్కలేదు. నీటి సరఫరా జరక్కపోవడంతో ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం నీటి కోసం గంటల తరబడి సమయం వెచ్చించాల్సి వస్తోంది. చేతి పంపులు కూడా అడుగంటిపోవడంతో...గ్రామ పొలిమేరల్లో ఉన్న చెలిమెలు, కుంటల్లోని నీరే ఆదివాసీలకు ఆధారమైంది. గొంతు తడుపుకోవడం కోసం.. వాగులు, ఒర్రెలు, చెలిమెలలోని కలుషిత నీటిని తాగుతున్నారు. అవి కలుషితంగా ఉండడం తో వ్యాధులు చుట్టుముట్టి మంచం పడుతున్నారు. నిత్యం నిద్ర లేచినప్పటి నుంచి కుటుంబమంతా తాగునీళ్ల కోసమే పాట్లు పడాల్సి వస్తోంది. నీటి ఎద్దడి సమస్య తీవ్ర రూపం దాల్చడంతో గొడ్డు గోదా నీళ్ల కోసం అల్లాడుతున్నాయి.