- కలెక్టరేట్ కు పాదయాత్రగా వెళ్లిన ఆదివాసీలు
- మద్దతు పలికిన సీపీఎం నాయకులు
ఖానాపూర్, వెలుగు: ఆదివాసీ గ్రామాల సమస్యలను పరిష్కరించడంలో పాలకులు, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తూ నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని ఆదివాసీ గ్రామాల ప్రజలు చలో నిర్మల్ కలెక్టరేట్ కు పిలుపు నిచ్చారు. శనివారం పెంబి మండలం చాకి రేవు గ్రామం నుంచి సీపీఎం నాయకులతో కలిసి నిర్మల్ కలెక్టరేట్ కు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు.
సీపీఎం రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు బండారు రవి కుమార్ పాదయాత్రను ప్రారంభించి మాట్లాడారు. పెంబి మండలంలోని 16 గ్రామాలకు సరైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దొత్తి వాగుపై వంతెన లేక వానాకాలంలో అవస్థ పడుతున్నామన్నారు. పసుపుల బ్రిడ్జి నిర్మాణాన్ని పాలకులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అర్హులైన ఆదివాసులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పోడు సాగు భూములకు పట్టాలు ఇచ్చి ఆయా గ్రామాల్లో తాగు నీటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. నాయకులు సురేశ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
