DACOIT: అడివి శేష్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’ అప్డేట్ .. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

DACOIT: అడివి శేష్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’ అప్డేట్ .. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్‌‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’. షానీల్‌‌ డియో దర్శకుడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌‌ శరవేగంగా జరుగుతోంది. ఒక ప్రేమ కథ అనేది ట్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

క్రిస్మస్ కానుకగా 2025 డిసెంబర్ 25న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. ఈ క్రమంలో ఇవాళ (అక్టోబర్ 28న) ‘డెకాయిట్’ మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది మార్చి 19, 2026 ఉగాది సందర్భంగా మూవీ రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్లింప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టీజర్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్‌‌‌‌‌‌‌‌ విజువల్స్‌‌‌‌‌‌‌‌తో సినిమాపై ఆసక్తి పెంచేశాయి. అంతేకాకుండా, ఈ సినిమాకి హీరో అడివి శేష్‌‌ కథ, స్క్రీన్ ప్లే అందించడంతో మరిన్ని అంచనాలు పెరిగాయి. 

ALSO READ : అధిక శ్రమ వృథా, ఫ్యామిలీ లైఫ్ ముఖ్యం..

ఇకపోతే, ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

అడవిశేష్ సినిమాల విషయానికి వస్తే:

అడవిశేష్ చివరగా హిట్ 2 మూవీలో కనిపించాడు. దాదాపు మూడేళ్ల తర్వాత డెకాయిట్తో థియేటర్ ఆడియన్స్ను పలకరిస్తున్నారు. ఇటీవలే హిట్ 3లో చిన్న క్యామియో రోల్ చేసి కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు తన కొత్త సినిమాతో వస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. 

అడవిశేష్ తన సినిమాలతో, స్క్రీన్ రైటర్గా ప్రత్యకమైన ఫ్యాన్స్ ఫాల్లోవింగ్ను సొంతం చేసుకున్నాడు. అడవి శేష్ కెరియర్లో వరుసగా క్షణం, గూడచారి, ఎవరు, మేజర్, హిట్ 2 వంటి విభిన్నమైన కాన్సెప్ట్స్తో వచ్చి సక్సెస్ అందుకున్నారు. దాంతో అతని సినిమాల కోసం ఎదురుచూసేలా చేసుకున్నాడు. అతి త్వరలో శేష్ నుంచి మరో సూపర్ హిట్ సీక్వెల్ గూఢచారి2తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.