నేషనల్ క్రస్ రష్మిక మందన్న త్వరలో బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పనుంది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోనుంది. ఇప్పటికే వీరి నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ తరుణంలో తన వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం సమతుల్యత గురించి లేటెస్ట్ గా రష్మిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తన రాబోయే చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్' ఈవెంట్‌లో ఇటీవల నిర్మాత SKN ఆమెను పొగడగా, రష్మిక మాత్రం తన అధిక పని గంటల షెడ్యూల్‌పై పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.
నిర్మాత ప్రశంసలు..
ఇటీవల 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్ర నిర్మాత SKN మాట్లాడుతూ.. ఈ రోజుల్లో ఎంతసేపు పనిచేయాలనే చర్చ నడుస్తోంది. కానీ, అవసరమైతే ఎంతసేపైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండే పాన్- ఇండియా హీరోయిన్ రష్మిక ఒక్కరే. ఆమె పనిని గంటల లెక్కన చూడరు. ప్రేమతో చూస్తారు. అందుకే ఆమె అందరికీ కుటుంబంలో సభ్యురాలిగా అనిపిస్తుంది అని ప్రశంసించారు. అయితే రష్మిక మాత్రం ఓ ఇంటర్వ్యూలో దీనికి భిన్నంగా స్పందించింది. తనపై తాను అధిక పనిభారం వేసుకోవడం సరైనది కాదు. ఎవరికీ ఇది సూచించదగినది కాదని స్పష్టం చేసింది.
ALSO READ : బంపర్ ఆఫర్ కొట్టేసిన బ్యూటీ మమితా బైజు..
అధిక శ్రమ వృథా..
'నేను అధికంగా పనిచేస్తాను, కానీ ఇది అస్సలు మంచి పద్ధతి కాదు అని రష్మిక చెప్పింది. ఇది స్థిరమైనది కాదు, దయచేసి చేయకండి. మీకు సౌకర్యంగా ఉన్న షెడ్యూల్‌ను మాత్రమే పాటించండి అని తోటీ నటీనటులకు సలహా ఇచ్చింది. ఎనిమిది గంటలు, అవసరమైతే 9 నుంచి-10 గంటలు కూడా నిద్రపోండి. నన్ను నమ్మండి, అది భవిష్యత్తులో మీకు ఎంతో మేలు చేస్తుంది. అధిక పని గంటల గురించి ఇటీవల చాలా చర్చలు చూశాను. నేను రెండింటినీ చేశాను, కానీ ఈ అధిక శ్రమ మాత్రం వృథా అని చెప్పింది.
కుటుంబ జీవితం కోసం..
తనకు 'నో' చెప్పడం రాకపోవడం వల్లే తాను చేయగలిగిన దానికంటే ఎక్కువ ప్రాజెక్ట్‌లు తీసుకుంటున్నానని రష్మిక తెలిపింది. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్న తరుణంలో షెడ్యూల్డ్ వర్క్ అవర్స్ అవసరమని బలంగా కోరింది. నాకు అవకాశం ఉంటే, దయచేసి మాలాంటి నటీనటులతో అంత ఎక్కువగా పనిచేయించవద్దు అని అడుగుతాను అని చెప్పింది.
కుటుంబ జీవితం ముఖ్యం..
ఆఫీసుల్లో 9 టు 5 టైమింగ్స్ ఉన్నట్లుగా, మాకూ ఆ షెడ్యూల్ ఉండాలి. ఎందుకంటే నాకు ఇంకా కుటుంబ జీవితం ఉంది, దానిపై దృష్టి పెట్టాలి. నా నిద్ర, వర్కవుట్‌లకు కూడా సమయం కావాలి. అప్పుడే భవిష్యత్తులో నేను బాధపడకుండా ఉంటాను. నేను ఇప్పటికీ నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. కానీ ప్రస్తుతం నేను చాలా ఒప్పుకోవడం వలన నా మాట చెల్లడం లేదు అని రష్మిక ఎమోషనల్ అయ్యింది.
ఇటీవల దీపికా పడుకొనే 8 గంటల షిఫ్ట్‌లు డిమాండ్ చేసింది. దీంతో రెండు పెద్ద తెలుగు ప్రాజెక్ట్‌ల నుంచి తప్పుకున్నారు. ఈ వార్తల నేపథ్యంలో రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు.. ఇండస్ట్రీలో నటీనటులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని, పని-జీవిత సమతుల్యత ఆవశ్యకతను మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అక్టోబర్‌లో విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం చేసుకున్న రష్మిక, ఏప్రిల్‌లో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
‘ది గర్ల్ ఫ్రెండ్’. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. రష్మికకు జంటగా దీక్షిత్ శెట్టి నటించారు.. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ మూవీ నవంబర్ 7న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
