Mamitha Baiju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బ్యూటీ మమితా బైజు.. ఏకంగా ధనుష్, సూర్య, విజయ్ లతో మూవీస్

Mamitha Baiju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బ్యూటీ మమితా బైజు.. ఏకంగా ధనుష్, సూర్య, విజయ్ లతో మూవీస్

ప్రేమలు మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు (Mamitha Baiju). ‘సర్వోపరి పాలకరన్’ అనే చిత్రంతో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగింది. గతేడాది వచ్చిన ప్రేమలు మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో అమ్మడు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగిచూసుకోకుండా క్రేజీ ఆఫర్స్ అమ్మడి తలుపు తట్టాయి. 

ఈ క్రమంలో నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ నటించిన రెబల్ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. లేటెస్టుగా హీరో ప్రదీప్ రంగనాధన్ డ్యూడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో మరోసారి ఆమె పేరు హాట్ టాపిక్గా మారింది. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఫోర్ తోజిల్' ఫేమ్ విగ్నేష్ రాజా దర్శకత్వంలో ధనుష్ హీరోగా 'D54' అనే వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో మమిత బైజు హీరోయిన్గా ఎంపికైనట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. ముందుగా ఈ పాత్ర కోసం పూజా హెగ్దేను అనుకున్నారు. కానీ, చివరకు మమితవైపు మేకర్స్ మొగ్గు చూపడంతో, గోల్డెన్ ఆఫర్ అందుకున్నట్లు నెటిజన్లు ట్వీట్స్ పెడుతున్నారు.  

ఇటీవలే 'D54' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా, వీపరీతంగా ఆకట్టుకుంది. పోస్ట‌ర్‌లో చుట్టూ కాలిపోతున్న పత్తి పంట మధ్యలో ధ‌నుష్ ఎమోషనల్గా నిల‌బ‌డి ఉండటం, అతని వెనుక అలుముకున్న భయంకరమైన మంటలు సినిమాకథాంశంపై ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. ఈ మూవీలో మమితా బైజుతో పాటుగా జయరామ్, కె.ఎస్. రవికుమార్, సూరజ్ వెంజరమూడు, కరుణాస్, పృథ్వీ పాండిరాజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

►ALSO READ | TheFamilyManSeason 3: మోస్ట్ అవైటెడ్ ‘ది ఫ్యామిలీ మేన్’ సీజన్ 3 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డా. ఇషారి కె. గణేష్, థింక్ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి విఘ్నేష్ రాజా, ఆల్ఫ్రెడ్ ప్రకాష్ కలిసి సినిమాకథను రూపొందించారు. వీరిద్దరూ కలిసి పోర్ తొళిల్‌ కూడా రాశారు. తేని ఈశ్వర్ కెమెరామెన్‌గా, శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్‌లు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం మమితా బైజు తెలుగులో వెంకీ అట్లూరి-సూర్య మూవీలో హీరోయిన్గా నటిస్తుంది. బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌‌ పరిశీలనలో ఉంది. సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌‌‌‌లో రిలీజ్ కానుంది.

విజయ్ ‘జన నాయకుడు’ మూవీలో మమితా బైజు ఓ కీలక పాత్ర పోషిస్తుంది. పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తుంది. బాబీ డియోల్, ప్రియమణి, గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యగదీష్ పళనిస్వామి, లోహిత్ కలిసి కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 9న మూవీ రిలీజ్ కానుంది.