TheFamilyManSeason 3: మోస్ట్ అవైటెడ్ ‘ది ఫ్యామిలీ మేన్’ సీజన్ 3 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

TheFamilyManSeason 3: మోస్ట్ అవైటెడ్ ‘ది ఫ్యామిలీ మేన్’ సీజన్ 3 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ఇండియన్ వెబ్ సిరీసుల్లో అత్యంత ఆదరణ పొందిన వాటిల్లో ‘ది ఫ్యామిలీ మేన్’ (The Family Man) సిరీస్ ఒకటి. ఇప్పటికే రెండు సీజన్స్ రాగా, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ మంగళవారం (అక్టోబర్ 28న) థర్డ్ సిరీస్ గురించి క్రేజీ అప్‌‌‌‌‌‌‌‌డేట్ అందించారు మేకర్స్.

‘ది ఫ్యామిలీ మేన్ రిటర్న్స్’ అంటూ రిలీజ్ డేట్ ప్రకటించారు. వచ్చే నెల (2025 నవంబర్ 21) నుండి ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ ఫన్నీ ప్రోమో రిలీజ్ చేసి  సిరీస్పై క్యూరియాసిటీ కలిగించారు. కాగా ది ఫ్యామిలీ మేన్ సీజన్ 3 పాన్ ఇండియా భాషలతో పాటుగా వరల్డ్ వైడ్గా స్ట్రీమింగ్కి అందుబాటులోకి రానుంది. 

మనోజ్ బాజ్‌‌‌‌‌‌‌‌పాయ్ లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌ను రూపొందించారు. ఇందులో గూఢచారి పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీకాంత్ తివారీగా మనోజ్ కనిపించనున్నాడు. ఓ వైపు దేశాన్ని కాపాడే స్పై ఏజెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, మరోవైపు మిడిల్ క్లాస్ మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గత రెండు సీజన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ మనోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నటన ఎంతో ఆకట్టుకుంది. ఇక అతనికి భార్యగా ప్రియమణి నటించింది. రెండో సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమంత కీ రోల్ చేసింది. ఇక పార్ట్ 3లో షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, ఆశ్లేష ఠాకూర్, వేదాంత్ సిన్హా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇకపోతే, సీజన్‌‌‌‌‌‌‌‌ 1లో మేజర్ విక్రమ్‌‌‌‌‌‌‌‌గా కీలకపాత్ర పోషించిన టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. పార్ట్ 3లోలోనూ కీరోల్‌‌‌‌‌‌‌‌లో కనిపించబోతున్నాడు. అలాగే, పాతల్ లోక్ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్టర్ జైదీప్ అహ్లావత్ విలన్ పాత్ర పోషించనున్నట్లు సమాచారం. కశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెర్రరిజంపై ఫస్ట్ పార్ట్, ఎల్టీటీఈపై సెకెండ్ పార్ట్ తీసిన రాజ్ అండ్ డీకే.. ఈసారి ఎలాంటి కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వస్తారో అనే అంచనాలు నెలకొన్నాయి.