
అడివి శేష్ హీరోగా రూపొందుతోన్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’.ఒక ప్రేమ కథ అనేది ట్యాగ్‌లైన్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శేష్ కథ, స్క్రీన్ ప్లే అందించగా, షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను మే 26న ఉదయం విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.
Jalaake raakh kar doonga saala 🔥#DacoitFire Glimpse incoming!#DACOIT pic.twitter.com/HQGp1xgsOf
— Adivi Sesh (@AdiviSesh) May 23, 2025
‘విట్‌నెస్ ద ఫైర్..’అంటూ ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ గ్లింప్స్‌పై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో శేష్ ఇంటెన్స్ లుక్‌లో దూరంగా ట్రైన్, కార్ ఫైర్ యాక్సిడెంట్‌ని చూస్తూ వెనుక నుంచి కనిపించడం క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.