ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ వాయిదా..

ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ వాయిదా..

ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ లో మార్పులు చేసినట్టు వెల్లడించింది  ఉన్నత విద్యామండలి. మూడు విడతలుగా ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభం కావాల్సిన షెడ్యూల్ ను వాయిదా వేసతున్నట్టు ప్రకటించింది. జూన్ 27 నుంచి ప్రారంభం కావాల్సిన షెడ్యూల్ వాయిదా పడింది. జులై 4 నుంచి ఇంజినీరింగ్ తొలివిడత ప్రవేశాల ప్రక్రియ మొదలు కానున్నట్టు తెలిపారు అధికారులు. 

జులై 6 నుంచి 13వరకు తొలి విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్..జులై 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం.. జులై 19న తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. జులై 26 నుంచి రెండో విడత కౌన్సిలింగ్.. జులై 27న సర్టిఫికెట్ వెరిఫికేషన్ .. జులై 27,28 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం.. జులై 31న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు. 

ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ..ఆగస్టు 9న సర్టిఫికెట్ వెరిఫికేషన్ గస్టు 9,10 తేదీల్లో  వెబ్ ఆప్షన్లకు అవకాశం.. ఆగస్టు 13న 3వ విడత సీట్ల కేటాయింపుఉంటుందని తెలిపారు. ఆగస్టు 21నుంచి కన్వినర్ కోట ఇంటర్నల్ స్లైడింగ్ కి అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించారు అధికారులు.