నేవీ కొత్త చీఫ్‌గా ఆర్. హరి కుమార్

V6 Velugu Posted on Nov 30, 2021

న్యూఢిల్లీ: నేవీ కొత్త చీఫ్‌గా ఆర్. హరి కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత అడ్మిరల్  కరంబీర్ సింగ్ స్థానంలో బాధ్యతలు తీసుకున్న హరి కుమార్.. రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటిదాకా ఆయన వైస్ అడ్మిరల్గా ఉన్నారు. 39 ఏళ్లపాటు పలు విభాగాల్లో సేవలందించిన హరికుమార్‌.. 1983లో నేవీలో ఉద్యోగిగా చేరారు. వెస్టర్న్ నేవల్ కమాండర్ గా కూడా ఆయన సేవలందించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో పూర్వ విద్యార్థి అయిన హరి కుమార్.. సుదీర్ఘ కెరీర్లో తనకు అప్పజెప్పిన బాధ్యతలను నిర్వర్తించడంలో సక్సెస్ అయ్యారు. నిషాంక్, కోరా, రణ్ వీర్ తోపాటు ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లకు ఆయన  చీఫ్‌గా వ్యవహరించారు.  

 

Tagged INS Viraat, Indian Navy, Karambir Singh, R Hari Kumar, Navy Chief Hari Kumar, Admiral R Hari Kumar 

Latest Videos

Subscribe Now

More News