
రాష్ట్రంలో రోజురోజుకు పీజీ కాలేజీల పరిస్థితి ఆధ్వానంగా మారుతోంది. కాలేజీల్లో సీట్లు నిండక కోర్సులు ముందుకు సాగే అవకాశం కనిపిస్తలేదు. దీంతో పీజీ కాలేజీలు విద్యార్థులు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రతి ఏటా సంగం సీట్లు కూడా ఫిల్ కాకపోవడంతో యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కాలేజీలకు ప్రభుత్వం టైంకు కావాల్సిన నిధులు ఇవ్వకపోవడంతో మూతపడే పరిస్థితి వచ్చిందని స్టూడెంట్ లీడర్స్ అంటున్నారు.
నగర కాలేజీలపై విద్యార్ధుల ఆసక్తి
యూనివర్సిటీలకు చెందిన కాలేజీలు ఎక్కువగా నగరాలు, పట్టణాల్లో ఉండటంతో.. వీటిలోనే చేరేందుకు విద్యార్ధులు ఆసక్తి చూపిస్తున్నారు. ఉన్నత విద్యావకాశాలు, ఇంగ్లీష్ లో పట్టుపెంచుకోడం, ఉద్యోగావకాశాలకు ఎక్కువగా చాన్స్ ఉండటంతో పట్టణాలు, నగరాల్లో ఉండే కాలేజీలవైపు మొగ్గుచూపుతున్నారు. వీటికి తోడు పార్ట్ టైం ఉద్యోగాలు సిటీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో పీజీ కాలేజీల్లో ఏటా అడ్మిషన్లు తగ్గుతున్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
ఓ కాలేజీలో ఐదుగురు అమ్మాయిలె
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం విద్యాహబ్ కు ప్రసిద్ది అని చెబుతారు. నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 2021–22 విద్యా సంవత్సరంలో ఎంఎస్సీ కెమిస్ట్రీ సబ్జెక్టులో ఓ కాలేజీలో ఐదుగురు అమ్మాయిలు చేరారు. దీంతో అక్కడ కోర్సును నడుపలేని పరిస్థితి నెలకొంది. విద్యార్ధులతో ఉన్నత విద్యాశాఖ, యూనివర్సిటీ అధికారులు సంప్రదించి ఇతర కాలేజీల్లో వారిని చేర్పించేందుకు ప్రయత్నించారు. అధికారుల ప్రతిపాదనకు నలుగురు అమ్మాయిలు ఓకే చెప్పిన.. ఒక అమ్మాయి ఇష్టపడలేదు. దీంతో ఆ అమ్మాయి చదువు మానుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని స్వయంగా అధికారులు గతంలో చెప్పారు.
ఆ ప్రచారంలో వాస్తవం లేదు: లింబాద్రి
పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పేంచేందుకు చర్యలు చేపడుతునామని ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి చెప్తున్నారు. అడ్మిషన్లు తక్కవ అవుతున్న కాలేజీలను మూసి వేస్తామని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఏవైన కాలేజీల్లో తక్కవ అడ్మిషన్లు అయితే వారిని దగ్గరలోని కాలేజీలకు షిఫ్ట్ చేసేల చర్యలు చేపడుతునామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నామని లింబాద్రి అన్నారు.
ఆందోళన చెందుతున్న అధికారులు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 320 కాలేజీల్లో 2021–22 విద్యాసంస్థరానికి పీజీ కోర్సుల్లో 44 వేల 604 సీట్లుంటే 22 వేల 812 మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్లను తీసుకున్నారు. ఈ ఏడాది సీట్లు పెరుగుతాయో.. తగ్గుతాయో అని అధికారులు ఆందోళన చెందుతున్నారు.