కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు.. అర్హతలు ఇవే..

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు.. అర్హతలు ఇవే..

కేంద్రియ విద్యాలయ సంఘటన్​ దేశవ్యాప్తంగా ఉన్న1247 కేంద్రియ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్​ రిలీజ్​ చేసింది. ఏప్రిల్​ 1 నుంచి మే 31 వరకు ఇంటర్మీడియట్​ మినహా మిగిలిన అన్ని తరగతుల వారు అడ్మిషన్లకు అప్లై చేసుకోవచ్చు.
 
ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల కోసం నెలకొల్పిన కేంద్రియ విద్యాలయా(కేవీ)లు నాణ్యమైన విద్యాబోధనకు వేదికలుగా మారాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1247 విద్యాలయాలు కొనసాగుతుండగా.. తెలంగాణలో దాదాపు 30 వరకు ఉన్నాయి.

సీట్లు: ఒక్కో కేంద్రియ విద్యాలయంలో తరగతికి 40 చొప్పున సీట్లు ఉంటాయి. ఒకటో తరగతిలో 40 సీట్లను భర్తీ చేస్తారు. కొన్ని కేవీల్లో సెక్షన్స్​ కూడా ఉంటాయి. అలా ఉంటే సెక్షన్​కు 40 సీట్లు భర్తీ చేస్తారు.  
వయసు: 1వ తరగతికి మార్చి 31 నాటికి 5 నుంచి 7 ఏళ్ల మధ్యలో ఉండాలి.  దివ్యాంగులైన స్టూడెంట్స్​కు రెండేళ్ల ఏజ్​ రిలాక్సేషన్​ ఉంటుంది.

అడ్మిషన్​ ప్రయారిటీస్​ 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, కేంద్ర ప్రభుత్వ అటానమస్​ సంస్థలు, పబ్లిక్​ సెక్టార్​ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల​ పిల్లలు, రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలు/పబ్లిక్​ సెక్టార్​ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల పిల్లలకు వరస ప్రకారం అడ్మిషన్​ ప్రయారిటీ ఇస్తారు. వీరితోపాటు సింగిల్​ గర్ల్​ చైల్డ్​కు, పార్లమెంట్​ మెంబర్స్​, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ, కేవీఎస్​ ఉన్నతాధికారులు సిఫార్సు చేసిన స్టూడెంట్స్​కు ప్రవేశాల్లో ప్రాధాన్యత ఉంటుంది. 

ఆర్​టీఈతో 10 సీట్లు
జాతీయ విద్యా హక్కు చట్టం 2009  గైడ్​లైన్స్​ ప్రకారం ప్రతి తరగతిలో 10 సీట్లను ఉచిత బోధనా పద్ధతిలో భర్తీ చేస్తారు. ఆన్​లైన్​లో లాటరీ ద్వారా వీరి ఎంపిక ఉంటుంది. ఒకటో తరగతిలో ఆర్​టీఈ కింద అడ్మిషన్​ పొందితే ఎనిమిదో తరగతి వరకు ఉచిత బోధన లభిస్తుంది. ఆర్​టీఈ కింద అప్లై చేసే వారు రెసిడెన్స్​ సర్టిఫికెట్​ కూడా సమర్పించాల్సి ఉంటుంది.  మేజర్​ సిటీస్​, అర్బన్​ ఏరియాస్​లో కేవీఎస్​ ఉంటే 5 కిలోమీటర్ల రేడియస్​ లోపల ఉన్న వారి అప్లికేషన్లే పరిగణనలోకి తీసుకుంటారు. మిగతా ప్రాంతాలైతే 8 కిలోమీటర్ల రేడియస్​లో ఉండాలి. దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయిస్తారు.

సెలెక్షన్​ ప్రాసెస్​
    1వ తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు వచ్చిన అప్లికేషన్లను కేటగిరీల వారీగా లాటరీ తీసి అడ్మిషన్స్​ కల్పిస్తారు. మొదట ఆర్​టీఈ కింద 10 సీట్లకు లాటరీ తీస్తారు. కేటగిరీ రిజర్వేషన్​కు అనుగుణంగా దివ్యాంగ విద్యార్థుల ఎంపికకు రెండో లాటరీ తీస్తారు. మూడో లాటరీలో ఆర్​టీఈ, దివ్యాంగ విద్యార్థుల సీట్లు పోను మిగిలిన సీట్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల పిల్లలను ఫిలప్​ చేస్తారు. అడ్మిషన్​ లాటరీకి స్కూల్​ ప్రిన్సిపల్​ కన్వీనర్​గా  ఓ టీచర్​, ఇద్దరు తల్లిదండ్రులు, ఓ వీఎల్​సీ మెంబర్​ మొత్తం అయిదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తారు. 

తొమ్మిదో తరగతిలో అడ్మిషన్​ పొందాలంటే అడ్మిషన్​ టెస్ట్​ రాయాల్సిఉంటుంది. కేటగిరీల వారీగా మెరిట్​ లిస్ట్​ చేసి అడ్మిషన్స్​ కల్పిస్తారు. హిందీ, ఇంగ్లిష్​, మ్యాథ్స్​, సైన్స్​, సోషల్​ సబ్జెక్టుల నుంచి 100 మార్కులకు ఎగ్జామ్​ ఉంటుంది. టెస్ట్​ డ్యురేషన్​ 3 గంటలు. కనీసం 33 శాతం మార్కులు సాధిస్తేనే పరిగణనలోకి  తీసుకుంటారు.  

ముఖ్యసమాచారం
దరఖాస్తులు: 1వ తరగతిలో ప్రవేశాలకు స్టూడెంట్​ బర్త్​ సర్టిఫికెట్​, ఫొటో, ఆధార్​ వివరాలతో ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. మిగిలిన తరగతులకు సంబంధించి ఆయా కేంద్రియ విద్యాలయాలు సీట్ల ఖాళీల ప్రకటన విడుదల చేశాక ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
1వ తరగతి అప్లికేషన్స్​: ఏప్రిల్​ 1 నుంచి ఏప్రిల్​ 19 వరకు
2 నుంచి 9 తరగతుల వరకు అప్లికేషన్స్​: ఏప్రిల్​ 8 నుంచి 15 వరకు
ఇంటర్​ అప్లికేషన్స్​: సీబీఎస్​ఈ టెన్త్​ రిజల్ట్​ వచ్చిన 30 రోజుల్లోపు అప్లై చేసుకోవాలి
వెబ్​సైట్​: kvsangathan.nic.in