
బిగ్‌బాస్ తెలుగు 9 (Bigg Boss Telugu 9) సీజన్ ఏడో వారంలోకి అడుగుపెట్టింది. ఉత్కంఠగా సాగుతున్న ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకుంది . ఇప్పటి వరకు ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేషన్ అయ్యారు. ఆదివారం భరణి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఏడో వారం నామినేషన్ ప్రక్రియ హై-వోల్టేజ్ డ్రామాకు తెరలేపింది. స్పెషల్ టాస్క్ లు, డ్రామాలతో మరింత రసవత్తరంగా మారింది.
నామినేషన్స్ కోసం స్పెషల్ టాస్క్
సాధారణ నామినేషన్ ప్రక్రియకు భిన్నంగా, ఏడో వారం నామినేషన్లు పవర్స్ ఆధారంగా జరిగాయి. ఈ పవర్స్‌ను గెలుచుకునే అవకాశం కెప్టెన్ల చేతిలో పెట్టారు బిగ్‌బాస్. ఈ వారం హౌస్‌కు సుమన్ శెట్టి, గౌరవ్ లు ఇద్దరు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. నామినేషన్స్ చేసే హక్కును గెలుచుకోవడానికి కెప్టెన్లు ఒక్కో కంటెస్టెంట్‌ను ఎంచుకోవాలని బిగ్‌బాస్ సూచించారు. దీంతో గౌరవ్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఆయేషాను ఎంచుకోగా, సుమన్ శెట్టి ఇమ్మాన్యుయేల్ (ఇమ్ము) ను ఎంపిక చేశాడు. ఆ తరువాత, వీరిద్దరికీ 'బెలూన్ టాస్క్' ఇచ్చారు. బెలూన్లను పగలగొట్టగా వచ్చిన చిట్టీలలో నామినేషన్ పవర్స్ ఉన్నాయి. ఈ పవర్స్‌ను బట్టి ఆయేషా, ఇమ్ము మిగిలిన ఇంటి సభ్యులకు నామినేషన్ టికెట్‌లను పంచిపెట్టారు. ఈ వినూత్న ప్రక్రియలో ఇమ్ముకి ఐదు స్లిప్‌లు దొరకగా, ఆయేషాకి మూడు స్లిప్‌లు లభించాయి. ఇమ్ము తన పవర్స్‌ని కల్యాణ్, దివ్య, రమ్య, తనూజ, రీతూలకు పంచుకోగా, ఆయేషా సంజన, శ్రీనివాస్లకు ఒక్కో స్లిప్ ఇచ్చింది.
ఆయేషా వర్సెస్ రీతూ..
ఈ వారం నామినేషన్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఆయేషా , రీతూ చౌదరి మధ్య జరిగిన మాటల యుద్ధం. తనకు లభించిన డైరెక్ట్ నామినేషన్ పవర్‌తో ఆయేషా నేరుగా రీతూ చౌదరిని టార్గెట్ చేసింది. రీతూను నామినేట్ చేస్తూ ఆయేషా తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. "నీ ఓవరాక్షన్, నీ లవ్ కంటెంట్ నాకు నచ్చలేదు. నువ్వు లవ్ కంటెంట్ కోసం హౌస్‌లోకి వచ్చావు" అంటూ రీతూ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసింది. దీనికి రీతూ ఆవేశంగా స్పందిస్తూ, నేను లవ్ చేస్తున్నానని చెప్పానా? నువ్వు పర్సనల్ విషయాలను నామినేషన్లలోకి లాగకు అని నిలదీసింది. అయినా వెనక్కి తగ్గని ఆయేషా.. నీకంత యాటిట్యూడ్ ఎందుకే? నీ గేమ్ స్ట్రాటజీ నన్ను ఆకట్టుకోలేదు అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఈ గొడవ హౌస్‌లో పెద్ద వివాదంగా మారింది. ఒక్కసారి కంటెస్టెంట్లు షాక్ అయ్యారు.
ఎలిమినేషన్ అయ్యింది ఎవరు?
భరణి శంకర్ ఆరో వారం ఎలిమినేట్ కావడంతో, ఇప్పటివరకు హౌస్ నుంచి శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, మాస్క్ మ్యాన్ హరీశ్, ఫ్లోరా సైనీ (ఆశా సైనీ), శ్రీజ దమ్ము (డబుల్ ఎలిమినేషన్), భరణి మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు. తాజా నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మొత్తం ఎనిమిది మంది ఇంటి సభ్యులు ఎలిమినేషన్ గండంలో నిలిచినట్లు సోషల్ మీడియా లీక్స్ ద్వారా తెలుస్తోంది. వారిలో రీతూ చౌదరి, కల్యాణ్, తనూజ, రాము, దివ్య, సంజనా, రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి కంటెస్టెంట్లు ఉన్నారు.
ఈ వారం నామినేషన్స్‌లో ఇద్దరు వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లు (రమ్య మోక్ష, శ్రీనివాస్ సాయి) ఉండటం గమనార్హం. కాగా, ఈ వారం నామినేట్ కావాల్సిన ఆయేషాను కెప్టెన్ గౌరవ్ తన పవర్ ద్వారా సేవ్ చేసినట్లు సమాచారం. ఈ నామినేషన్ల వేడి హౌస్‌లో ఎలాంటి కొత్త గ్రూపులకు, గొడవలకు దారి తీస్తుందో చూడాలి.