బంగారం ధర రూ.3 లక్షలకు చేరుకుంటుందా లేదా తగ్గుతుందా ? 100 ఏళ్ల చరితలో ఫస్ట్ టైం..

 బంగారం ధర రూ.3 లక్షలకు చేరుకుంటుందా లేదా  తగ్గుతుందా ?  100 ఏళ్ల చరితలో ఫస్ట్ టైం..

ఈ ఏడాది 2025లో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి, దింతో పెట్టుబడిదారుల్లో బంగారం ధరలు ఏ స్థాయికి చేరుకుంటుందనే చర్చ మొదలైంది. అక్టోబర్ 16న మన దేశంలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.1,28,395 అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. అంటే జనవరి నుండి 67% పెరిగింది. 2025లో బంగారం ధరల్లో ఈ పెరుగుదల స్టాక్ మార్కెట్లను కూడా అధిగమించింది. 31 డిసెంబర్  2024 నుండి 14 అక్టోబర్  2025 మధ్య MCX గోల్డ్ ఫ్యూచర్స్ 64% కంటే పైగా ఎగిసింది. అదే కాలంలో BSE సెన్సెక్స్ కేవలం 5% మాత్రమే పెరిగింది. ఈ వరుస పెరుగుదల 2030 నాటికి బంగారం ధరలు 10 గ్రాములకు రూ.3 లక్షలకు చేరుకుంటుందా లేదా అనూహ్యంగా క్షిణించి పడిపోతుందా  అని నిపుణులు  అంచనా వేస్తున్నారు. 
  
పరిశోధన విశ్లేషకుడు రాహుల్ జైన్ ప్రకారం గత 100 సంవత్సరాల బంగారం చరిత్రలో ఇలాంటి పెంపు ఎప్పుడూ చూడలేదు. కేవలం 18 నెలల్లోనే బంగారం ధరలు రెట్టింపు అయ్యాయి. ఇంత పెరుగుదల ఉంటుందని ఏ ఆర్థికవేత్త లేదా జ్యోతిష్కుడు ఊహించలేదు అని అన్నారు. 

బంగారం ధరల్లో ప్రస్తుత పెరుగుదల ముఖ్యంగా  రిజర్వ్  బ్యాంకుల వల్ల కాదు, ప్రైవేట్ పెట్టుబడిదారుల వల్లేనని డేటా చూపిస్తుంది. 2025లోనే సెప్టెంబర్ నాటికి బంగారు ETFలలో (ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్) పెట్టుబడులు $64 బిలియన్లను దాటాయి. అంటే 2024లో ఉన్న మొత్తం కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. ముఖ్యంగా, ఈ పెట్టుబడిలో 50% కంటే ఎక్కువ ఉత్తర అమెరికా నుండి వచ్చాయి.  

బంగారం ధరలు పెరగడానికి కారణాలు ఏమిటంటే, దేశాల మధ్య  వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా వడ్డీ రేట్లు,  ప్రజల్లో కొనుగోలు ఆసక్తి (డిమాండ్) పెరగడం. అలాగే ధరలు పెరుగుతున్నప్పుడు ఇంకా ఎక్కువ మంది పెట్టుబడిదారులు పెట్టుబడి పెడతారు. ఇది ధరలు పెరిగేందుకు మరింత బలాన్నిస్తుంది. 

►ALSO READ | సంవత్‌ 2081: 433 కంపెనీలు, 2.9 లక్షల కోట్లు: ఈక్విటీ మార్కెట్ల రికార్డు...

అయితే, 2024లో కొన్ని రిజర్వ్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లను కొంచెం తగ్గించాయి. పోలాండ్, కజకిస్తాన్, చైనా, టర్కీ వంటి దేశాలు మాత్రం ఇప్పుడూ చాలా ఎక్కువగా బంగారాన్ని కొని  నిల్వ చేసుకుంటున్నాయి. ఈ సంవత్సరం ఈ దేశాలు అన్ని కలిసి 70 టన్నులకు పైగా బంగారం కొన్నాయి. ముఖ్యంగా ప్రపంచంలో అస్థిరత ఇలాగే కొనసాగితే 2026-2027 నాటికి కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోలు మళ్లీ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

బంగారం ధర  3 లక్షలకు చేరుతుందా: 1980లో సామాన్య ప్రజలు వారి ఆస్తుల్లో దాదాపు 8% బంగారంలో పెట్టేవారు. కానీ 2010లలో 2-3%కి తగ్గింది, కానీ ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. అదే విధంగా, రిజర్వ్ బ్యాంకులు ప్రస్తుతం వాటి నిల్వల్లో కేవలం 20-22% మాత్రమే బంగారం  ఉంది. గతంలో 50-60% స్థాయిలో ఉండేది, దానితో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువ.