SSMB29: noveMBerలో మాసివ్ ట్రీట్.. నవంబర్ 16న ముహూర్తం ఫిక్స్

SSMB29: noveMBerలో మాసివ్ ట్రీట్.. నవంబర్ 16న  ముహూర్తం ఫిక్స్

మహేష్ బాబు హీరోగా  రాజమౌళి దర్శకత్వంలో  ఓ భారీ అడ్వెంచరస్‌‌ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.  ‘ఎస్‌‌ఎస్‌‌ఎంబీ 29’ వర్కింగ్‌‌ టైటిల్‌‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.  ఇప్పటికే ఇండియాలో రెండు షెడ్యూల్స్‌‌, కెన్యాలో ఓ షెడ్యూల్‌‌ను పూర్తి చేశారు. అయితే  ఈ సినిమా నుంచి అఫీషియల్‌‌ అప్‌‌డేట్‌‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు నవంబర్‌‌‌‌లో ఫస్ట్ లుక్‌‌ను రిలీజ్ చేయబోతున్నట్టు ఇటీవల రాజమౌళి ప్రకటించారు.

దీనికి  నవంబర్ 16న  ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఫస్ట్ లుక్ మాత్రమే కాకుండా టైటిల్ గ్లింప్స్‌‌ కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. దీనికోసం హాలీవుడ్ స్థాయిలో ఓ గ్రాండ్ ఈవెంట్‌‌ను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.  వచ్చే నెలలో మాసివ్ ట్రీట్ రాబోతోందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ప్రియాంక చోప్రా హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.   దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌‌పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు.