తిరుపతి జూ పార్క్‌లోని వైట్ టైగర్ మృతి

తిరుపతి జూ పార్క్‌లోని వైట్ టైగర్ మృతి

తిరుపతి: తిరుపతి శ్రీ వేంకటేశ్వర నేషనల్‌ జూ పార్క్‌లోని వైట్‌ టైగర్‌ ‘సమీర్‌’ మృతి చెందింది. అనారోగ్యంతో బాధపడుతున్న సమీర్‌ మూత్రపిండాల్లో నీటి నిల్వ, వృద్ధాప్యం కారణంగా మరణించినట్లు వెటర్నరీ వైద్యులు వెల్లడించారు. వైట్‌ టైగర్‌ సమీర్‌‎ను 2011లో హైదరాబాద్‌ నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ నుంచి తిరుపతి జూ పార్క్‌కు తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే సంరక్షణలో ఉంది. సమీర్‌ మృతిపై జూ అధికారులు విచారం వ్యక్తం చేశారు.