ఏపీ కాలేజీ ఆఫ్ జర్నలిజం కోర్సులకు అడ్మిషన్లు షురూ

ఏపీ కాలేజీ ఆఫ్ జర్నలిజం కోర్సులకు అడ్మిషన్లు షురూ

హైదరాబాద్, వెలుగు: జర్నలిజంలో ఆసక్తి కలిగినవారు కోర్సుల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఏపీ కాలేజ్​ఆఫ్​జర్నలిజం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిజం కోర్సులకు 2024–25 సంవత్సరానికి అడ్మిషన్లను ప్రారంభించినట్టు కాలేజీ డైరెక్టర్ ​తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్​జర్నలిజం(పీజీడీజే) ఏడాది కోర్సు,  డిప్లొమా ఇన్​జర్నలిజం(డీజే), డిప్లొమా ఇన్​టీవీ జర్నలిజం(డీటీవీజే) ఆరు నెలల కోర్సులకు డిగ్రీ విద్యార్హత కాగా, సర్టిఫికెట్​ కోర్సు ఆఫ్​జర్నలిజం(సీజే) 3 నెలల కోర్సుకు టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి.

ఆయా కోర్సులను రెగ్యులర్​గా, దూర విద్యలోనూ చేయవచ్చని, ఆన్​లైన్​ లో ఇంటి వద్దనే పాఠాలు వినవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆయా కోర్సులను తెలుగు, ఇంగ్లీషు మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చన్నారు. ఈనెల 29వ తేదీ వరకు ప్రాస్పెక్టస్, దరఖాస్తు ఫారాలు పొందవచ్చని, మార్చి 5వ తేదీ వరకు అడ్మిషన్లు పొందడానికి అవకాశం ఉందని వివరించారు. వివరాలకు ఫోన్ నంబర్లు  9848512767, 7286013388, ల్యాండ్​లైన్​: 040‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–79610940లో సంప్రదించాలని సూచించారు.