మనం తినేది కారం పొడి కాదు.. రంపపు పొట్టు.. హైదరాబాదీల ఆరోగ్యంతో వ్యాపారుల కల్తీ దందా

మనం తినేది కారం పొడి కాదు.. రంపపు పొట్టు.. హైదరాబాదీల ఆరోగ్యంతో వ్యాపారుల కల్తీ దందా

మేడిపల్లి వెలుగు: మేడ్చల్‌‌‌‌‌‌‌‌ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలో కల్తీ మసాలాల దందా గుట్టురట్టయింది. ఎస్‌‌‌‌‌‌‌‌ఓటీ మల్కాజిగిరి, ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో సుమారు రూ.25 లక్షల విలువైన కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి సీపీ సుమతి మీడియాకు వివరాలు వెల్లడించారు. శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌నగర్ కాలనీలోని సాయి తిరుమల ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌‌‌‌‌లో అపరిశుభ్ర వాతావరణంలో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలాలను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 

కారం పొడిలో ఏకంగా 30 శాతం రంపపు పొట్టు కలుపుతున్నట్లు బయటపడింది. ప్రముఖ బ్రాండ్‌‌‌‌‌‌‌‌ను పోలి ఉండేలా ‘స్వస్వస్తిక్‌‌‌‌‌‌‌‌ డిష్‌‌‌‌‌‌‌‌’పేరుతో డూప్లికేట్ లేబుల్స్, ప్యాకింగ్‌‌‌‌‌‌‌‌ ఉపయోగిస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. అధికారుల దాడిలో 2,300 కిలోల పసుపు, 3,350 కిలోల కారం, 5,140 కిలోల ధనియాల పొడి, 100 కిలోల గరం మసాలా కలిపి మొత్తం 10,890 కిలోల మసాలా పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి సత్యనారాయణ, రుద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నారు.