చిన్నారుల ప్రాణాలతో చెలగాటం.. కల్తీ చాక్లెట్స్తో దందా

చిన్నారుల ప్రాణాలతో చెలగాటం.. కల్తీ చాక్లెట్స్తో దందా

హైదరాబాద్లో కల్తీ రాజ్యమేలుతుంది.  మొన్నటివరకు కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఐస్ క్రీమ్ లతో దందా నడిపిన కేటుగాళ్లు ఇప్పుడు  కల్తీ చాక్లెట్స్ తమారుచేస్తూ చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.  రాజేంద్రనగర్ లోని హైదర్గూడలో సుప్రజా ఫుడ్స్ పేరుతో కల్తీ దందా నిర్వహిస్తున్నారు కంత్రిగాళ్లు.  అనూస్ ఇమ్లీ, క్యాడీ జెల్లి పేరుతో చాక్లెట్స్ తయారీ చేస్తున్నారు.  ఇందులో ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నారు.  

అంతేకాకుండా పరిశ్రమలో ఎక్కడా కూడా నాణ్యతా ప్రమాణాలు కనిపించడం లేదు.  దుర్గంధంలోనే చాక్లెట్ల తయారీ చేస్తున్నారు.   వాటికి ఆకర్షణీయమైన స్టిక్కరింగ్ చేసి మార్కెట్ లో విక్రయస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల నుండి కానీ స్థానిక జీహెచ్ఎంసీ అధికారుల నుండి కానీ నిర్వాహకులు ఎలాంటి అనుమతి పొందలేదు. సంబంధిత అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.  కల్తీ చాక్లేట్స్ తయారీ చేస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు.