తనకు ప్రాణహాని ఉందని హైకోర్ట్ చీఫ్ జస్టిస్ కి అడ్వకేట్ కరుణ సాగర్ లెటర్ రాశారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన అల్లర్ల గురించి తెలిసిందే. దీనికి కారణమైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్టు కూడా చేశారు. ఈ కేసులో రాజాసింగ్ కు వ్యతిరేకంగా అడ్వకేట్ కరుణ సాగర్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో తన ప్రాణానికి ముప్పుందని తెలియజేస్తూ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ కి అడ్వకేట్ కరుణ సాగర్ లేఖ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సరైన సెక్యూరిటీ కల్పించేలా ఆర్డర్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ కేసును వాదిస్తున్నందుకు తనను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కరుణ సాగర్ ఆరోపించారు. హైకోర్టు ఆవరణలోనూ తనపై దాడిచేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడి ఈ సందర్భంగా కరుణ సాగర్ లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల హైదరాబాద్ లో చెలరేగిన ఉద్రిక్తతలకు కారకుడిగా పేర్కొంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్టు చేశారు. ఆ తర్వాత రిమాండ్ రిపోర్టును కోర్టు తిరస్కరించడంతో ఆయన విడుదలయ్యారు. ఈ కేసులో కోర్టులో వాదనలు వినిపించిన లాయర్ కరుణ సాగర్ కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఇటీవలే ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై హైదరాబాద్ పోలీసులను ఫిర్యాదు చేశారు.
