
బిగ్బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బిగ్బాస్ 7 ఫ్యాన్స్ వీరంగం కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు జూబ్లిహిల్స్ పోలీసులు. ఇక పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ కేసులో ప్రశాంత్ని A-1గా చేర్చారు. ప్రస్తుతం ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పల్లవి ప్రశాంత్ తరుపు అడ్వకేట్ రాజేష్ కుమార్ జూబ్లీహిల్స్ పీఎస్‌కు వచ్చి కేసు వివరాలు తెలుసుకున్న అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఎక్కడ లేదని తెలిపారు. పల్లవి ప్రశాంత్ పై నమోదు చేసిన కేసు Fir కాపీ కోసం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ను సంప్రదించాను. కానీ Fir కాపీకి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పట్లేదని..ఈ FIR కాపీ కోసం ప్రశాంత్ కుటుంబ సభ్యులు రావాలని ఇన్స్పెక్టర్ చెప్తున్నట్లు అడ్వకేట్ రాజేష్ వెల్లడించారు. దీంతో FIR కాపీని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలిసిన బాధ్యత పోలీసులదే అని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ పై ఎటువంటి కేసు పెట్టారో..అందులో తన పాత్ర ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు ఈ కేసును ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలంటే FIR కాపీ అవసరం. ఇప్పుడు ఆ FIR కాపీ లేకపోవడంతో బెయిల్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నాము అంటూ అడ్వకేట్ రాజేష్ తెలిపారు.
అంతేకాకుండా..ఇలానే పల్లవి ప్రశాంత్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచిన ఆనందాన్ని కూడా పూర్తిగా కోల్పోయి..ఫోన్ కూడా స్విచ్ఛాప్ చేసుకొని ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్లిపోవడం ఫ్యామిలీ మెంబర్స్ కి..ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తుందన్నారు. అతనికి అండగా ఉంటూ న్యాయసహాయం అందిస్తానని..రైతుబిడ్డ ప్రశాంత్పై కక్ష సాధింపు తగదని అడ్వకేట్ రాజేష్ కుమార్ తెలిపారు.