వేట మొదలైందా : కాళేశ్వరం అవినీతిపై ఏసీబీకి కంప్లయింట్

వేట మొదలైందా : కాళేశ్వరం అవినీతిపై ఏసీబీకి కంప్లయింట్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నిమిషాల వ్యవధిలోనే.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కథ కదిలింది. ఈ ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతిపై యాంటీ కరప్షన్ బ్యూరో.. ఏసీబీకి కంప్లయింట్ చేశారు ప్రముఖ లాయర్ రాపోలు భాస్కర్. నకిలీ ఎస్టిమేషన్లు, ఎక్కువ కోట్ చేయటం ద్వారా.. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నారని.. మాజీ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, కవితతోపాటు కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ ఫిర్యాదు చేశారు రాపోలు భాస్కర్. వీరితోపాటు ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేయాలని కోరారు. 

తాగు, సాగు నీటి ప్రాజెక్టుల పేరుతో మాజీ సీఎం కేసీఆర్, కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిలు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని.. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేయాలని కోరారు లాయర్ రాపోలు భాస్కర్. దీనిపై ఏసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఓ పాయింట్ అయితే.. అసలు ప్రభుత్వానికి తెలిసే ఈ కంప్లయింట్ చేశారా లేక వ్యక్తిగతంగానే ఈ కంప్లయింట్ చేశారా అనేది చర్చనీయాంశం అయ్యింది. మొత్తానికి కొత్త ప్రభుత్వంలో.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఫస్ట్ కంప్లయింట్ రావటం విశేషం.. 

ఈ పరిణామాలు చూస్తుంటే వేట మొదలైందా అనే వాయిస్ వినిపిస్తుంది సోషల్ మీడియాలో...