హిండెన్ బర్గ్ రిపోర్టుపై విచారణకు సుప్రీం ఓకే

హిండెన్ బర్గ్ రిపోర్టుపై విచారణకు సుప్రీం ఓకే

న్యూఢిల్లీ : గౌతమ్ అదానీ వ్యాపార సంస్థలపై తీవ్రమైన ఆరోపణలు చేసి న హిండెన్ బర్గ్  రీసెర్చ్ రిపోర్టుపై విచారణ జరపాలని అడ్వొకేట్  విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్​పై విచారణ జరిపేం దుకు సుప్రీం ఓకే చెప్పింది. శుక్రవా రం విచారించనుంది. హిండెన్ బర్గ్  రిపోర్టుపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో ఒక కమిటీని నియమించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని తివారీ కోరారు. ఈ పిల్ పై అత్యవసర విచారణ జరపాలని చీఫ్​ జస్టిస్  డీవై చంద్రచూడ్, జస్టిస్  పీఎస్  నరసింహ, జస్టిస్  జేబీ పార్దివాలాతో కూడిన బెంచ్​కు ఆయన విజ్ఞప్తి చేశారు. హిండెన్ బర్గ్  రిపోర్టుతో దేశ ప్రతిష్ట మసకబారింద ని ఆయన పేర్కొన్నారు.