AFG vs NED: నెదర్లాండ్స్ కొంపముంచిన రనౌట్లు.. ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

AFG vs NED: నెదర్లాండ్స్ కొంపముంచిన రనౌట్లు.. ఆఫ్ఘనిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో పెద్ద జ‌ట్ల‌కు షాకిచ్చిన నెదర్లాండ్స్ బ్యాటర్లు.. కీలక మ్యాచ్‌లో తడబడ్డారు. భారీ స్కోర్ నిర్ధేసించి.. ఆఫ్ఘన్ జట్టుకు షాకిస్తారనుకుంటే రనౌట్ల రూపంలో వారే ఔటై కనీసం పోరాడే లక్ష్యాన్ని కూడా నిర్ధేశించలేకపోయారు. లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 179 పరుగులకే కుప్పకూలింది

టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన నెదర్లాండ్స్ తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. ముజీబర్ రెహ్మాన్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి వెస్లీ బ్యారేసి(3) పెవిలియన్‌ చేరాడు. అనంతరం ఓడౌడ్(42), అకెర్ మాన్(29) నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. అలా ధాటిగా సాగుతున్న డచ్ ఇన్నింగ్స్ ను రనౌట్లు కొంపముంచాయి. ఓడౌడ్, అకెర్ మాన్, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్, ఎంగిల్ బ్రెట్జ్ రూపంలో నలుగురు రనౌట్ అయ్యారు.  ఎంగిల్ బ్రెట్జ్(58) ఒక్కడే పర్వాలేదనిపించాడు. దీంతో 46.3 ఓవర్లలో 179 పరుగుల వద్ద నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆప్ఘన్ బౌలర్లలో మహ్మద్ నబీ 3, నూర్ అహ్మద్‌ 2,  ముజీబ్ ఒక వికెట్ తీశారు.