బాబర్ ఆజం డకౌట్.. పాక్ బ్యాటర్లను వణికిస్తోన్న అఫ్ఘాన్ బౌలర్లు

బాబర్ ఆజం డకౌట్.. పాక్ బ్యాటర్లను వణికిస్తోన్న అఫ్ఘాన్ బౌలర్లు

అఫ్ఘనిస్తాన్‌తో జరుగుతోన్న తొలి వన్డేలో పాకిస్తాన్ బ్యాటర్లు తడబడుతున్నారు. ఆ జట్టు ఓపెనర్ ఫకార్ జమాన్ రెండు పరుగులకే పెవిలియన్ చేరగా.. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఆపై కాసేపటికే మహమ్మద్ రిజ్వాన్(22) కూడా ఔట్ అవ్వడంతో పాకిస్తాన్ జట్టు కష్టాల్లో పడింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన పాక్..  పవర్ ప్లే ముగిసేసరికి మూడు కీలక వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్(2) ను.. ఫజల్హక్ ఫరూఖీ ఔట్ చేయగా.. బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్ లను స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ పెవిలియన్ చేర్చాడు. ఆసియా కప్ 2023 సన్నద్దతలో భాగంగా పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య శ్రీలంక వేదికగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతోంది.