మెంటల్ ఎక్కించిన పాక్ vs ఆఫ్గన్ మ్యాచ్.. చివరి ఓవర్‌లో నరాలు తెగాయి

మెంటల్ ఎక్కించిన పాక్ vs ఆఫ్గన్ మ్యాచ్.. చివరి ఓవర్‌లో నరాలు తెగాయి

క్రికెట్ మ్యాచ్ అంటే ఇండియా vs పాక్ అనుకుంటాం.. కానీ నిన్న అంటే ఆగస్ట్ 24వ తేదీ జరిగిన పాకిస్తాన్ vs ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అంతకంటే మెంటల్ ఎక్కించింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసిన అభిమానులకు నరాలు తెగాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గన్ 300 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో పాక్ చివరి వరకు ఓ యుద్ధమే చేసింది. అయితే చివరి 6 బంతుల్లో పాక్ విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. ఇక్కడే క్రికెట్ అభిమానులకు నరాలు తెగాయి.. అదెలాగో చూద్దాం..

రహ్మనుల్లా ఒంటరి పోరాటం

టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఆఫ్గనిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 300 పరుగులు చేసింది. ఓపెనర్‌ గుర్బాజ్‌ (151; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) పరుగులతో.. పాక్ బౌలర్లపై దండయాత్ర చేశాడు. మరో ఓపెనర్‌ ఇబ్రహీమ్‌ జద్రాన్‌ (80; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి తొలి వికెట్‌కు 227 పరుగులు జోడించిన గుర్బాజ్‌.. ఏ చిన్న అవకాశాన్ని పాక్ బౌలర్లకు ఇవ్వలేదు. మరో ఎండ్ లో వికెట్లు పడుతున్నా.. తాను మాత్రం ఎక్కడా వెనకడుగు వేయలేదు. ఒంటరి పోరాటం చేసి.. పాక్ ముందు భారీ టార్గెట్ నిర్ధేశించేలా చేశాడు.

పాక్ పరువు నిలబెట్టిన షాదాబ్ ఖాన్

అనంతరం 301 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు పాక్.. 48 ఓవర్లు ముగిసేసరికి 274-8 వద్ద నిలిచింది. చివరి రెండు ఓవర్లలో పాక్‌ విజయానికి 27 పరుగులు.. ఆఫ్ఘన్ విజయానికి రెండు వికెట్లు. ఈ సమయంలో పాక్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్.. వీరోచితంగా పోరాడాడు. ఆఫ్ఘన్ ఫీల్డర్ల అలసత్వాన్ని అవకాశంగా చేసుకొని.. అబ్దుల్ రెహ్మాన్ వేసిన 49వ ఓవర్‌లో ఏకంగా 16 పరుగులు రాబట్టాడు.

తొలి బంతికి ముందే మన్కడింగ్

ఆఖరి ఓవర్‌లో పాక్ విజయానికి..11 పరుగులు. ఈ సమయంలో ఆఫ్ఘన్ బౌలర్ ఫజాల్హక్ పారూఖీ సమయస్ఫూర్తిగా వ్యవహరించాడు.తొలి బంతి వేయడానికి రనప్ తీసుకొని.. షాదాబ్ ఖాన్‌ను మన్కడింగ్ చేశాడు. ఆ సమయంలో పాక్ బౌలర్ నసీం షా తన అద్భుత బ్యాటింగ్ తో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. అనతకుముందు పాక్‌ బ్యాటర్లలో ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ (91; 4 ఫోర్లు), షాదాబ్‌ ఖాన్‌ (48; 3 ఫోర్లు, 1 సిక్స్‌), బాబర్‌ ఆజమ్‌ (53; 6 ఫోర్లు) రాణించారు. ఆఫ్గాన్‌ బౌలర్లలో ఫజల్హాక్ ఫారూఖీ మూడు వికెట్లతో అదరగొట్టాడు.

దీంతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే పాక్ 2–0తో సిరీస్ సొంతం చేసుకుంది.