ఆసియా కప్‌ నుంచి అఫ్గానిస్తాన్ ఔట్.. సూపర్‌‌‌‌‌‌‌‌-4కు శ్రీలంక, బంగ్లా

 ఆసియా కప్‌ నుంచి అఫ్గానిస్తాన్ ఔట్.. సూపర్‌‌‌‌‌‌‌‌-4కు శ్రీలంక, బంగ్లా

అబుదాబి: ఆసియా కప్‌‌‌‌లో అఫ్గానిస్తాన్ పోరాటం ముగిసింది. సూపర్‌‌‌‌‌‌‌‌–4 రౌండ్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో బ్యాటర్లు మెరిసినా.. బౌలింగ్ వైఫల్యంతో చేజేతులా ఓడింది. గురువారం జరిగిన గ్రూప్‌‌‌‌–బి చివరి పోరులో లంక 6 వికెట్ల తేడాతో గెలిచింది. గ్రూప్‌‌‌‌–బిలో టాప్ ప్లేస్‌‌‌‌ సాధించిన లంక తనతో పాటు బంగ్లాదేశ్‌‌‌‌ను సూపర్‌‌‌‌‌‌‌‌–4కు తీసుకెళ్లింది. ఈ మ్యాచ్‌‌‌‌లో తొలుత అఫ్గాన్‌‌‌‌ 20 ఓవర్లలో 169/8 స్కోరు చేసింది. ఆల్‌‌‌‌రౌండర్ మహ్మద్ నబీ ( 22 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 60) మెరుపు ఫిఫ్టీతో జట్టుకు మంచి స్కోరు అందించాడు.  

లంక లెఫ్టార్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నబీ ఏకంగా5 సిక్సర్లు కొట్టి 32 రన్స్ రాబట్టాడు. కెప్టెన్ రషీద్ ఖాన్ (24), ఇబ్రహీం జద్రాన్ (24) కూడా రాణించగా.. నువాన్ తుషారా (4/18) నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లంక 18.4 ఓవర్లలో 171/4 స్కోరు చేసి గెలిచింది. కుశాల్ పెరీరా (28), కమిందు మెండిస్‌‌‌‌ (26 నాటౌట్‌‌)తో కలిసి ఓపెనర్ కుశాల్ మెండిస్ (74 నాటౌట్‌‌) అద్భుత ఫిఫ్టీతో జట్టును గెలిపించాడు. అతనికే  ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్ అవార్డు లభించింది.