
చేవెళ్ల, వెలుగు: అనుమతులు లేకుండా మద్యంతో ఫాంహౌస్లో బర్త్ డే పార్టీ చేసుకుంటున్న ఆఫ్రికన్లను సైబరాబాద్పోలీసులు అరెస్ట్చేశారు. రాజేంద్రగనర్ డీసీపీ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఉగాండా, కెన్యా, లిబేరియన్, నైజీరియా, కామెరాన్ దేశాలకు చెందిన పలువురు కొంతకాలంగా హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. ఉగాండా దేశానికి చెందిన 'మమ' అనే మహిళ బర్త్డే ఉండడంతో ఆమె రంగారెడ్డి జిల్లా మొయినాబాద్పరిధిలోని బాకారం జాగీర్రెవెన్యూలోని ఎస్కే నేచర్రిట్రీట్ఫాంహౌస్లో గురువారం రాత్రి పార్టీ ఏర్పాటు చేసింది.
ఈ పార్టీకి ఉగాండాకు చెందిన 34 మందితో పాటు కెన్యా, లిబేరియన్, నైజీరియా, కామెరూన్ దేశాలకు చెందిన 17 మంది వచ్చారు. కేక్ కటింగ్తర్వాత మద్యం సేవిస్తుండగా స్థానిక పోలీసులు, ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. 14 మంది పురుషులు,37 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 12 మంది స్టూడెంట్స్కూడా ఉన్నారు.
డ్రగ్స్, గంజాయి తీసుకుని ఉంటారేమో అన్న అనుమానంతో నార్కోటిక్స్, ఎక్సైజ్ పోలీసులు పరీక్షలు చేశారు. ఇందులో కొందరికి గంజాయి పాజిటివ్ వచ్చింది. అనుమతి లేకుండా తీసుకువచ్చిన 90 విదేశీ, స్వదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పర్మిషన్లేకుండా మద్యంతో పార్టీ చేసుకోవడం, విపరీతమైన సౌండ్ పెట్టినందుకు కేసులు నమోదు చేశారు.
గడువు ముగిసినా ఇక్కడే..
36 మంది వీసా, పాస్పోర్టు గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నారని గుర్తించారు. ఆరుగురు మహిళలు, తొమ్మిది మంది పురుషుల దగ్గరే వ్యాలిడ్వీసా ఉందని గుర్తించి వీరిని వదిలిపెట్టారు. వీసా ఎక్స్పైర అయి, పాస్ పోర్ట్ రెన్యూవల్చేసుకోని వారిని వారి దేశం పంపించడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.