దారుణం..48 గంటల్లోనే 10 మంది చిన్నారులు మృతి

దారుణం..48 గంటల్లోనే 10 మంది చిన్నారులు మృతి

రాజస్థాన్ లోని  కోటా ఆస్పత్రిలో  అప్పుడే  పుట్టిన  10 మంది  చిన్నారులు చనిపోయిన ఘటన కలకలం రేపుతోంది.  48 గంటల్లోనే 10 మంది చిన్నారులు చనిపోవడంపై  విమర్శలొస్తున్నాయి. ఘటనపై  విచారణకు  కమిటీ వేసింది రాజస్థాన్ ప్రభుత్వం. కమిటీ  నివేదిక వచ్చాకే  దీనిపై  మాట్లాడుతామన్నారు ముఖ్యమంత్రి  అశోక్ గెహ్లాట్. ఇక  హాస్పిటల్ లో  పరిశుభ్రత, సదుపాయాలకు సంబంధించి అన్నింటిపై  కమిటీ విచారణ  జరుపుతుందన్నారు  స్టేట్  హెల్త్ సెక్రటరీ  వైభవ్.

ఈ నెలలో  ఇప్పటికే   77 మంది చిన్నారులు  చనిపోయినట్లు  హాస్పిటల్ అధికారులు  తెలిపారు. తమ హాస్పిటల్ కు  ఎక్కువగా  క్రిటికల్ కేసులు వస్తాయన్నారు.  ఇలాంటి కేసుల్లో చాలా వరకు  ప్రాణాలు కాపాడినా.. కొంతమంది  చనిపోతుంటారని  చెప్పారు. మరోవైపు  ICU లో  అపరిశుభ్రత  వల్లే  తమ  పిల్లలు  చనిపోయారని  ఆరోపిస్తున్నారు  తల్లిదండ్రులు. పైన ఉండే బాత్రుం  నుంచి  ICU లోకి  వాటర్ లీక్  అవుతోందన్నారు. దుర్వాసన వస్తోందని  సిబ్బందికి  ఎన్నిసార్లు  చెప్పినా  పట్టించుకోవడం లేదన్నారు.