
కెరీర్ ప్రారంభించి ఇరవయ్యేళ్లు దాటినా.. ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతోంది త్రిష. స్టార్ హీరోలందరితోనూ స్ర్కీన్ షేర్ చేసుకున్న ఎక్స్‌పీరియెన్స్ ఆమెకుంది. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టు ఆమె లిస్టులో చేరబోతోంది. మెగాస్టార్ చిరంజీవికి జంటగా త్రిష కనిపించబోతోందని తెలుస్తోంది. ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి 156వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో చిరుకి జోడీగా అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్ సహా పలువురు సీనియర్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే ఫైనల్‌గా త్రిషను ఫిక్స్ చేశారట మేకర్స్. త్రిష కూడా ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. గతంలో ‘స్టాలిన్’ చిత్రంలో చిరంజీవితో కలిసి నటించింది త్రిష. 16 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
ఫాంటసీ అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే త్రిష ప్రస్తుతం మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో తెరకె క్కుతోన్న చిత్రంలో నటిస్తోంది.