జనం రోడ్ల మీదికొచ్చిన్రు..

జనం రోడ్ల మీదికొచ్చిన్రు..

రెండు నెలలుగా ఇండ్లకే పరిమితమైన జనాలు రోడ్ల మీదికి వచ్చిన్రు. మంగళవారం బస్సులు తిరగడంతో ఊళ్లకు పోయేటోళ్లు బస్టాండ్ల బాట పట్టిన్రు. షాపులు తెరవడంతో చాలా రోజుల తర్వాత జనం కావలిసినయి కొనుక్కునే పనిలో పడ్డారు. ఆటోలు, క్యాబ్ లు, ప్రైవేట్ వెహికల్స్​ తో రోడ్లు రద్దీగా మారాయి. కొన్ని ఊర్లలో వేలాది జనం బయటకు వస్తే, కొన్ని ఊర్లలో కరోనా బుగులుతో చాలా మంది బయటికి రాలేదు. బయటికి వచ్చినోళ్లూ ..భయం భయంతోనే పనులు చేసుకుని పోవడం కనిపించింది.

లాక్ డౌన్ రూల్స్ సడలింపులతో షాపులు తెరుచుకున్నాయి. ఒక్కసారిగా వేలల్లో జనం బయటకు వచ్చారు. వరంగల్
చౌరస్తా ఏరియాలో మంగళవారం కనిపించి న సీన్ ఇది.