నేటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పున:ప్రారంభం

నేటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పున:ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఇండియా నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు ఆయా సంస్థలు రెడీ అయ్యాయి. కోవిడ్ కారణంగా తాత్కాలికంగా రద్దయిన అంతర్జాతీయ విమానాలు నేటి నుంచి తిరిగి ప్రారంభంకానున్నాయి.దాదాపు రెండేళ్ల తర్వాత ఇండియా నుంచి అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభిస్తున్నామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. మారిషస్, మలేషియా,థాయిలాండ్, టర్కీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా,ఇరాక్ తోపాటు 40 దేశాలకు చెందిన 60 విదేశీ విమాన సంస్థలు సమ్మర్ షెడ్యూల్2022లో 1783 ఫ్రీక్వెన్సీలను ఇండియా నుంచి నడపడానికి అనుమతి పొందాయి. ఇది ఈ ఏడాది అక్టోబర్ 29 వరకు అమలులో ఉంటుంది. కోవిడ్ ను కట్టడి చేసేందుకు కేంద్రం ప్రభుత్వం మార్చి  2020 నుంచి అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది.

మరిన్ని వార్తల కోసం

ఆర్టీసీ చార్జీలు రూ. 5 నుంచి 14 వరకు పెరిగే చాన్స్

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం