V6 News

ఆ ఊరికి రేషన్ వచ్చింది..20 ఏళ్ల తర్వాత స్వగ్రామంలో రేషన్ సరుకులు తీసుకున్న గ్రామస్తులు

ఆ ఊరికి రేషన్ వచ్చింది..20 ఏళ్ల తర్వాత స్వగ్రామంలో రేషన్ సరుకులు తీసుకున్న గ్రామస్తులు
  •     తగ్గిన 4 కిలోమీటర్ల దూరాభారం

 నిర్మల్, వెలుగు: ప్రభుత్వం ఉచిత రేషన్​ఇస్తున్నటి నుంచి ఆ గ్రామంలో రేషన్​షాపు లేదు. 20 ఏండ్లుగా ఆ ఊరి ప్రజలు ప్రతి నెలా కాలినడకనో, ఎడ్ల బండి పైనో పక్క గ్రామానికి వెళ్లి సరుకులు తెచ్చుకునేవారు. ఈ ఊరేదో మారుమూలన ఉందనుకుంటే పొరపాటే. నిర్మల్​ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఎల్లారెడ్డిపేట. ఆ గ్రామంలో ఇప్పటివరకు రేషన్ షాప్​​ లేకపోవడంతో గ్రామస్తులు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలాయిపేటలోని రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తీసుకొచ్చుకుంటున్నారు. తమ ఊర్లోనే రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు ఏండ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నా సమస్య పరిష్కారం కాలేదు. 

పక్క గ్రామంలోని మేడిపల్లికి చెందిన నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి సమస్యను గుర్తించి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి శ్రీహరిరావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన కలెక్టర్ అభిలాష అభినవ్ కు వివరించారు. స్పందించిన కలెక్టర్ ఎల్లారెడ్డిపేటలోనే రేషన్ షాపు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భీమారెడ్డితో పాటు గ్రామ సర్పంచ్ రోజా శేఖర్, మాజీ ఎంపీటీసీ విలాస్, నిలాయిపేట మాజీ సర్పంచ్ సాయన్న, ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ రాము తదితరులు ఆదివారం రేషన్​షాపును ప్రారంభించి సరుకులు పంపిణీ చేశారు.