ఫేక్ ఫేస్ బుక్ పోస్టు పెట్టాడని 604 రోజులు సౌదీ జైలులో..

ఫేక్ ఫేస్ బుక్ పోస్టు పెట్టాడని 604 రోజులు సౌదీ జైలులో..

సౌదీ ప్రిన్స్ ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే అభియోగంపై ఓ వ్యక్తికి జైలు శిక్ష పడింది. సౌదీలో ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) టెక్నీషియన్ గా పని చేస్తున్న ఆ వ్యక్తి పేరు హరీశ్ బెగేరా. అతడి స్వస్థలం కర్ణాటకలోని బిజడీ. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ పై ఫేస్ బుక్ అభ్యంతరకర పోస్టులు పెట్టాడని 34 ఏళ్ల హరీశ్ ను.. 604 రోజులు జైలులో ఉంచారు.

రీసెంట్ గా జైలు నుంచి విడుదలైన హరీశ్ ఈ విషయంపై స్పందించాడు. చేయని తప్పుకు 2019, డిసెంబర్ 22 నుంచి తనను జైలులో ఉంచారని వాపోయాడు. తాను ఆ పోస్టు పెట్టనప్పటికీ క్షమాపణలు చెబుతూ ఓ వీడియో చేశానన్నాడు. అయితే తన పేరుతో ఎవరో కావాలని ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, అందులో నుంచి ప్రిన్స్ పరువుకు నష్టం కలిగేలా పోస్టులు పెట్టారని స్పష్టం చేశాడు. ఈ కేసులో తనను కావాలనే ఇరికించారని ఆరోపించాడు. ఎవరో చేసిన తప్పుకు తాను శిక్ష అనుభవించానని.. తనను టెర్రరిస్టులా చూశారని ఆవేదన వ్యక్తం చేశాడు.