గూగుల్, మెటాకు పోటీగా ఇండియాలో AI విప్లవం: టాటా గ్రూప్‌తో OpenAI భారీ డీల్ !

గూగుల్, మెటాకు పోటీగా ఇండియాలో AI విప్లవం: టాటా గ్రూప్‌తో OpenAI భారీ డీల్ !

 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ OpenAI భారతదేశంలో భారీ AI కంప్యూట్ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి టాటా గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తో పార్ట్నర్షిప్ గురించి ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం ద్వారా OpenAI దాని AI మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి, పెద్ద సంస్థలకు అత్యాధునిక ఏజెంట్ AI సొల్యూషన్‌లను అందించడానికి వీలవుతుంది. దీనిని OpenAI  స్టార్‌గేట్ ఇండియా ప్రాజెక్ట్‌లో ఒక భాగం అని అంటున్నారు.

OpenAI సంస్థ, TCS  కొత్త డేటా సెంటర్ విభాగం హైపర్‌వాల్ట్ నుండి కనీసం 500 MW సామర్థ్యంగల డేటా సెంటర్ లీజుపై సంతకం చేయడానికి చర్చలు జరుపుతోంది. గత నెలలో TCS & ప్రైవేట్ ఈక్విటీ సంస్థ TPG కలిసి  18వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టి గిగావాట్-లెవెల్  AI-సిద్ధంగా ఉన్న డేటా సెంటర్‌లను నిర్మించడానికి భాగస్వామ్యం ప్రకటించాయి. ఈ హైపర్‌వాల్ట్‌లో OpenAI మొదటి అతిపెద్ద కస్టమర్‌గా ఉండే అవకాశం ఉంది.

ALSO READ : ఇండిగో ఫ్లైట్ల పరేషాన్..

గతంలో OpenAI ఇదే విధమైన భాగస్వామ్యం కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో చర్చలు జరిపింది, కానీ షరతులపై అభిప్రాయాలు కుదరకపోవడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత రిలయన్స్, గూగుల్ ఇంకా మెటాతో  సంబంధాలను పెంచుకుంది.

దింతో TCS, ప్రపంచంలోనే అతిపెద్ద AI సేవల సంస్థగా మారాలని చూస్తోంది. OpenAIతో ఈ డీల్ TCS ఆశయాన్ని మరింత స్పీడ్  చేయనుంది. ప్రభుత్వాలు డేటా లోకలైజేషన్  పై పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ భాగస్వామ్యం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించాలని ఇరు సంస్థలు చూస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ప్రకారం, భారతదేశ డేటా సెంటర్ సామర్థ్యం ప్రస్తుత స్థాయి  నుండి 2030 నాటికి మూడు రెట్లు పెరిగి 4.5 గిగావాట్‌లకు చేరుకుంటుందని అంచనా.