రోడ్డు మంజూరైతే అడ్డుకుంటారా?

రోడ్డు మంజూరైతే అడ్డుకుంటారా?

 

  •     ఫారెస్ట్ ఆఫీసర్ల తీరుపై రెండు గ్రామాల ప్రజల మండిపాటు 
  •     కాగజ్‌‌నగర్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్ ముందు ధర్నా

కాగజ్ నగర్, వెలుగు: రేకులగూడా, ఉట్ పల్లి గ్రామాలకు రోడ్డు కోసం 30 ఏళ్లుగా పోరాటం చేస్తే ఈ మధ్య మంజూరైంది. కానీ దానికి అనుమతులు ఇవ్వకుండా అటవీశాఖ అడ్డుకుంటోందని కాగజ్​నగర్​ అటవీ డివిజనల్​ అధికారి కార్యాలయం ఎదుట రెండు గ్రామాల ప్రజలు ధర్నా నిర్వహించారు.  ఈ  రహదారికి అనుమతులు లేవని చెబుతూ అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు తమ గ్రామ రహదారికి అనుమతులు ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు. గ్రామస్థుల ఆందోళన పై కాగజ్ నగర్ ఎఫ్ డీవో విజయ్ కుమార్ స్పందించారు.  గిరిజనుల దగ్గరకు వచ్చి మాట్లాడారు.  గిరిజన గ్రామాలకు సౌకర్యం కలిగేందుకు తాము అడ్డుకాదని, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ అందుబాటులో లేరని ఆయన రాగానే రెండు రోజుల్లో రోడ్డుకు పర్మిషన్ ఇచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.